ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, నవంబర్ 2019, శుక్రవారం

Emi lenappudu

ఏమి లేనప్పుడు నన్ను దీవించెను(అసలు)
ఇంత వరకు యెహోవా సహయపడెన్
ఇంత వరకు ప్రభువే నడిపించిన

1.కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు
   పూర్ణముగా పోవు దినము వచ్చెను
   అందరూ చేయి దాటి వెళ్ళలేదుగా
   ఇంత వరకు యెహోవా సహాయపడెన్

2.నిందితుడనై ఒంటరి పరదేశీనై
   ఇల్లు ఊరు విడిచి తిరిగినప్పుడు
   స్వంత ఇంట్లో చేర్చుకొందునని చెప్పిన నాధుడు
   ఈరోజు వరకు సజీవునిగా ఉన్నాడు

3.శోధనలు మనలు చుట్టివచ్చినా-సాతాను అంబులెన్ని     తగిలిన
  భయము లేదు మనకిక ప్రభువుచెంత నుండుము
  యేసుతో ఠీవిగాను పోదము

Gadichina kaalamanthaa

గడచిన కాలమంతా కృపతో దాచిన
నా యేసయ్య నీకే వందనం వందనం

1.కనురెప్పపాటైనా కనుమూయక-కనుపాపవలె నన్ను       కాచితివే
కాపరివై నను నడిపిన యేసయ్యా నీకే నా ఆరాధన
ఆరాధనా ఆలపన-ఆరాధనా నీకే స్తోత్రార్పణ

2.పరిపూర్ణమైన నీ ఆత్మాభిషేకమును-వరముగా నాకు దయచేసినావే
అభిషేకనాధుడా నా యేసయ్యా నీకే నా ఆరాధనా

3.పిలిచిన పిలుపుకు తగినట్లుగా-ఆత్మీయ అనుభవం నేర్పితివే
నీతిని బోధించినా యేసయ్య నీకే నా ఆరాధన



18, నవంబర్ 2019, సోమవారం

Andaru nannu vidachina song lyrics

అందరు నన్ను విడచినా-నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే-నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
1.లోకము నన్ను విడచినా-నీవు నన్ను విడువనంటివే (2)
   నా బంధువు నీవే-నా మిత్రుడ నీవే
   నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
2.వ్యాధులు నన్ను చుట్టినా-బాధలు నన్ను ముట్టినా (2)
   నా కొండయు నీవే-నా కోటయు నీవే
   నా కొండ కోట నీవే యేసయ్యా (2)
3.నేను నిన్ను నమ్ముకొంటిని-నీవు నన్ను         విడువనంటివే (2)
  నా తోడుయు నీవే -నా నీడయు నీవే
  నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||