అందరు నన్ను విడచినా-నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే-నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
నా తల్లియు నీవే-నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
1.లోకము నన్ను విడచినా-నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే-నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
నా బంధువు నీవే-నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
2.వ్యాధులు నన్ను చుట్టినా-బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే-నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నా కొండయు నీవే-నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
3.నేను నిన్ను నమ్ముకొంటిని-నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే -నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
నా తోడుయు నీవే -నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి