ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, జూన్ 2021, మంగళవారం

Anandam neelone

 ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై    ||ఆనందం||

పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా    ||ఆనందం||

నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే    ||ఆనందం||

సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం    ||ఆనందం||

7, జూన్ 2021, సోమవారం

Varninchalenu vivarinchalenu

 వర్ణించలేను వివరించలేను

యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)

పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను       ||యేసయ్యా||

తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు (2)
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను        ||యేసయ్యా||

6, జూన్ 2021, ఆదివారం

Neevunte chalu naaku yesayya

 నీవుంటే చాలు నాకు యేసయ్యా

బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్య

ఆదరించువాడవు ఆదుకొనువాడవు
సేదదీర్చువాడవు స్వేచ్చనిచ్చువాడవు

బలహీన సమయంలో నాకృప చాలంటివి
విశ్వసించిన చాలు విజయంబు నీదంటివి

నా హృదయమే నీ ఆలయం అని అంటివి
నాలోన నివసించే గొప్ప వానిగావుంటివి

లోకంతము వరకు నను విడువను అంటివి
ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి